Monday, May 6, 2024

పొలాల్లో పోలియో డ్రాప్స్

మంగపేట, ( ప్రభ న్యూస్ ) : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. పోలియో డ్రాప్స్ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలతో పాటు మొబైల్ టీం ద్వారా కూడా పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూక్య నగేష్ నాయక్ ఆధ్వర్యంలో పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వాళ్ల చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చేపట్టిన పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తూ పంటపొలాల వద్దకు వెళ్లి అక్కడ చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేస్తున్న డాక్టర్ నగేష్ నాయక్ ను ఇతర వైద్య సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement