Wednesday, May 1, 2024

“ప్రాజెక్ట్ కే” లేటెస్ట్ అప్డేట్.. షూటింగ్ లో జాయిన్ కానున్న ప్ర‌భాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒక్క‌టైన‌ “ఆదిపురుష్” ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉండగా.. ఈ మూవీ తరువాత “సలార్” రానుంది. ఇక ఈ సినిమాల త‌రువాత‌ రిలీజ్ రేస్ లో ఉన్న పాన్ వరల్డ్ సినిమా “ప్రాజెక్ట్ కే”. యంగ్ డైరెక్ట‌ర్ నాగ్ ఆశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ సినిమా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు మేక‌ర్స్.

అయితే, షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అవ్వాడినికి వ‌చ్చింది. కాగా, తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒక్క‌టి సినీ స‌ర్కిల్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ నెల‌ 26న షూటింగ్ కోసం ప్రాజెక్ట్ కే సెట్స్ లో ప్రభాస్ అడుగు పెట్టనున్నాడట. అక్కడ నుంచి కొన్ని రోజులు షూట్ కొనసాగనుంది. ఇక ఈ మూవీలో బిగ్ బి అమితాబ్, దీపికా పదుకొనె లాంటి బిగ్ స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement