Thursday, May 2, 2024

ఇన్‌స్పెక్ట‌ర్‌, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్.. అవినీతి ఆరోపణలే కారణం

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : అవినీతి ఆరోపణలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రజలకు సేవ చేయాల్సిన వృత్తిలో ఉండి అక్రమార్జన కోసం చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడే పోలీస్ అధికారులపై సస్పెండ్ వేటు వేస్తూ, క్రమ శిక్షణ చర్యలు చేపట్టడంలో రాజీ పడబోనని చెప్పకనే చెబుతున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హసన్ పర్తి ఇన్‌స్పెక్టర్ గా పని చేసిన రావుల నరేందర్ పై సస్పెండ్ వేటు వేశారు. అలాగే రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కేసులు నమోదు చేసినందుకు హెడ్ కానిస్టేబుల్ బి. వెంకటయ్య ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement