Monday, October 14, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా.. సంచ‌ల‌న ట్వీట్ చేసిన బండ్ల గ‌ణేశ్

ఎప్ప‌టి నుండో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినిమా చేయాల‌ని ఎదురు చూస్తున్నాడు న‌టుడు..నిర్మాత బండ్ల గ‌ణేశ్. అయినా పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఛాన్స్‌ ఇవ్వడం లేదు. నేడు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చే కొత్త మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయనున్నట్లు డి వి వి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. సుజిత్ ఈ సినిమాకు డైరెక్టర్ అని తెలిపింది చిత్ర బృందం. అలాగే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసిన చిత్ర బృందం ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. అయితే.. ఈ పోస్టర్‌ ను ఉద్దేశించి.. బండ్ల ట్వీట్‌ చేశారు. వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం, దాంతోపాటు ప్రసాదం కూడా తిందాం, లేకపోతే టైం వేస్ట్ అన్నారు. అలాగే, భారత చలన చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ చిత్రంగా నిలవాలని నిలిచే విధంగా రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బండ్ల గణేష్ ట్వీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది.ఆ దేవుడితో టైం వేస్ట్ అని ట్వీట్ చేశారు బండ్ల‌గ‌ణేశ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement