Friday, May 3, 2024

డ్ర‌గ్స్ కేసులో నిర్మాత కేపీ చౌద‌రి అరెస్ట్

మ‌రోసారి డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి సినీ ప‌రిశ్ర‌మ‌ని కుదిపేసింది. డ్ర‌గ్స్ కేసులో సినీ నిర్మాత కేపీ చౌద‌రిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన డగ్స్ వాడుతున్నట్టు తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చౌదరి నుంచి కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వాడుతున్న కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు. రజనీకాంత్ ‘కబాలి’ సినిమాకు కేపీ చౌదరి నిర్మాతగా వ్యవహరించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement