Wednesday, May 8, 2024

రేపు రైతుల ఖాతాల్లోకి ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌ నిధులు.. 12వ విడత నిధుల జమకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 12వ విడత డబ్బులు సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానుంది. అక్టోబరు 17న పీఎం కిసాన్‌ నిధి డబ్బులను రైతులకు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశ వ్యాప్తంగా 12కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున అందనున్నాయి. దీపావళి పండుగకు ముందు, పంట కోతల స మయంలో కిసాన్‌ సమ్మాన్‌ నిధులు రైతులకు ఉపయుక్తంగా ఉండనున్నాయి.

సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లిdలో ప్రధాని మోడీ కిసాన్‌ సమ్మాన్‌ నిధులను విడుదల చేయనున్నారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే కిసాన్‌ సమ్మాన్‌ నిధులను చెల్లిస్తున్నారు. ఈ లెక్కన తెలంగాణలోని దాదాపు 10లక్షల మంది రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధులు అందనున్నాయి. 5 ఎకరాల లోపు రైతులకు మూడు విడతల్లో విడతకు రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలను కేంద్ర ప్రభుత్వం పంట పెట్టుబడి ప్రోత్సాహకంగా అందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement