Friday, May 10, 2024

అబుదాబిలో ప్రధాని మోడీ.. ఆలింగనంతో ఆత్మీయ స్వాగతం పలికిన అధ్యక్షుడు

అబుదాబి: జర్మనీలో జరిగిన రెండు రోజుల జీ7 సదస్సు ముగించుకుని అబుదాబీ విచ్చేసిన ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయేద్‌ ఆల్‌ నహ్యాన్‌ ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు దేశ ఉన్నతాధికారులు, రాయల్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆయన విమనాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన భారత ప్రధాని మోడీని అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదర స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల తండ్రిని కోల్పోయిన అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ను వ్యక్తిగతంగా పరామర్శించి సానుభూతిని ప్రకటించనున్నారు.

యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా ఈ ఏడాది మేలో మరణించారు. అబుదాబికి 2004 నుంచి అధ్యక్షుడుగా పని చేసిన షేక్‌ ఖలీఫా మరణానంతరం, కొత్త అధ్యక్షుడిగా షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్‌యాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ యూఏఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య భద్రత,విద్య, పెట్టుబడుల అంశాలపై చర్చలు జరగనున్నాయి. అబుదాబి పర్యటనపై ప్రధాని మోడీ ట్విట్టర్‌ లో ట్వీట్‌ చేశారు. తనకు స్వాగతం పలికిన సోదరుడు ప్రెసిడెంట్‌ షేక్‌ మహ్మద్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ ఇస్లాం వ్యవస్థాపకుడు మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానిపై ముస్లిం దేశాలు ఇండియాకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement