Saturday, May 4, 2024

రిపబ్లిక్ డే ఉత్స‌వాల‌కు ముఖ్యఅతిథి ఈజిప్టు అధ్యక్షుడు.. ఆహ్వానించిన భార‌త ప్ర‌భుత్వం

వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతాహ్‌ అల్‌ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది. రిపబ్లిక్‌ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు హాజరుకావడం ఇదే తొలిసారి. భారత్‌-ఈజిప్టు దేశాల మధ్య గత ఏడున్నర దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి.

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల రెండు దేశాలు 75వ వార్షికోత్సవాలు కూడా జరుపుకున్నాయి. కాగా, ప్రతి ఏడాది భారత గణతంత్ర వేడుకలకు విదేశీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఎవరూ ముఖ్య అతిథులుగా హాజరుకాలేదు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement