Monday, April 29, 2024

Smart phones | ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్స్‌.. లాంచింగ్‌కు రెడీగా ఉన్న‌వి ఇవే!

ఇండియన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుత‌న్నాయి. గత నెలలో గూగుల్, శామ్‌సంగ్, ఐకూ, నోకియా వంటి బడా కంపెనీల కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ నెల‌లో కూడా పాపులర్ బ్రాండ్ల నుంచి ప్రీమియం ఫోన్లు లాంచ్ అయ్యే అవ‌కాశాలున్నాయి.. వాటిలో టాప్ స్మార్ట్‌ఫోన్లు ఏమున్న‌యో చూద్దాం..

- Advertisement -
  • iQOO నియో 7 ప్రో

iQOO నియో 7 ప్రో జూన్‌ 20న ఇండియాలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అడ్వాన్స్‌డ్‌ కూలింగ్ సిస్టమ్స్‌, గేమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో వ‌స్తోంది. ఈ గేమింగ్-ఫోకస్డ్ డివైజ్ 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్స్ ఆఫర్ చేస్తుంది. దీని ధర సుమారు రూ.35 వేలు ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌లో 120Hz AMOLED 1080P డిస్‌ప్లే, 1/1.57″ ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఇది 5000mAh బ్యాటరీతో రానుందని, 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని టెక్ ఎక్స్‌ప‌ర్ట్ చెబుతున్నారు.

  • Motorola Razr 40 సిరీస్

మోటొరోలా కంపెనీ మేలో ఇంటర్నేషనల్ మార్కెట్లలో Razr 40 Series విడుదల చేసింది. ఆ తర్వాత ఇండియాలో కూడా ఆ ఫోన్లు లాంచ్‌ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. Razr 40 7వ తరం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 4200 mAh బ్యాటరీ, 1.5-అంగుళాల కవర్ స్క్రీన్, 144Hz 1080P డిస్‌ప్లే ఉంటుంది. దీని కెమెరా డిపార్ట్‌మెంట్ అంత ఆకర్షణీయంగా ఏమీ లేదు. ఇక Razr 40 అల్ట్రా LTPO టెక్నాలజీతో 3.6-అంగుళాల కవర్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3800 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది. ఈ అల్ట్రా వేరియంట్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో మెరుగైన పనితీరు, థర్మల్ మేనేజ్‌మెంట్‌ను అందిస్తుంది.

ఇండియాలో Razr 40 ధర రూ.60 వేల నుంచి మొదలవుతుందని, అల్ట్రా వేరియంట్‌ రూ.95 వేల వరకు ధర పలకవచ్చని అంచనా. వీటి కచ్చితమైన లాంచ్ డేట్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు కానీ, జూన్ మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

  • మోటో ఎడ్జ్ 40 Pro

ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ Razr 40 సిరీస్‌తో పాటు లాంచ్ అవుతుందని సమాచారం. ఇది హై రిఫ్రెష్ రేట్‌తో 1080P డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సిస్టమ్ (50MP+12MP+50MP), వైర్‌లెస్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్, USB-C టైప్ 3.2 కనెక్టివిటీ, IP68 వాటర్ రెసిస్టెన్స్, 4K రికార్డింగ్ చేయగల ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. దీని ధర సుమారు రూ.55,000 ఉంటుందని అంచనా.

  • వన్‌ప్లస్ నార్డ్ 3

వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్, జూన్ 21న లాంచ్ అవుతుందని సమాచారం. ఇది చైనీస్ OnePlus Ace 2Vని పోలి ఉంటుంది. కాగా ఇండియన్ వెర్షన్‌లో వేరే ప్రధాన కెమెరా ఉండవచ్చు. ఫోన్‌లో 64MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP కెమెరా ఉండొచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K AMOLED డిస్‌ప్లేతో రానుంది. డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్ ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆక్సిజన్ OS 13తో వస్తుంది. మూడేళ్ల పాటు మేజర్ OS అప్‌డేట్లను పొందుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement