Wednesday, May 1, 2024

ట్రైన్ టికెట్ టైగ‌ర్ .. హీరో రానా పోస్ట‌ర్

ట్రైన్ టికెట్ టైగ‌ర్ టైటిల్ తో ఉన్న పోస్ట‌ర్ ని రిలీజ్ చేశాడు హీరో రానా. ఈ టైటిల్‌ చాలా కొత్తగా ఉండటమే కాదు.. రానా రైల్వే ప్లాట్ ఫాంపై పులి చారలతో డిజైన్‌ చేసిన లుంగీ వేసుకుని, రైల్వే అధికారిగా స్టైలిష్‌గా న్యూ అవతార్‌లో కనిపిస్తున్నాడు. అంతేకాదు రేపే ప్రీమియర్ కాబోతుందని క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. అయితే ఇంతకీ ఇది కొత్త సినిమానా..? లేదా సిరీస్‌ టైటిల్‌ లుక్‌ పోస్టరా..? లేదంటే యాడ్ లుక్ మాత్రమేనా.. అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టాడు. దీనిపై రానా రేపు అందరికీ ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. రానా మరోవైపు బాబాయి వెంకటేశ్‌ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్‌ చేస్తున్నాడు. ఈ నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ విడుదలకు రెడీ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement