Saturday, May 11, 2024

కేంద్ర పాలిత ప్రాంతాల‌కు మ‌రో 1.92 కోట్ల డోసుల వ్యాక్సిన్లు: ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్

వ‌చ్చే 15 రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు మ‌రో 1.92 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను ఉచితంగా పంపిణీ చేయ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ వెల్ల‌డించారు. ఈ నెల 16 నుంచి 31 మ‌ధ్య ఈ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాల‌కు అందుతాయ‌ని చెప్పారు. ఇందులో 1.62 కోట్ల కొవిషీల్డ్ డోసులు, 29.49 ల‌క్ష‌ల కొవాగ్జిన్ డోసులు ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు. వినియోగిస్తున్న తీరు, రెండో డోసులు పొందాల్సిన వారి ఆధారంగా ఈ కేటాయింపులు జ‌ర‌ప‌నున్న‌ట్లు జ‌వ‌దేక‌ర్ చెప్పారు. మే నెల‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 1.7 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు పంపిణీ చేసిన‌ట్లు కేంద్రం స్ప‌ష్టం చేసింది. వ్యాక్సిన్ త‌యారీ కంపెనీల నుంచి రాష్ట్రాలు, ప్రైవేటు హాస్పిట‌ల్స్ నేరుగా కొనుగోలు చేసేందుకు మే నెల‌లో 4.39 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉన్న‌ట్లు కేంద్రం తెలిపింది. ఇక శుక్ర‌వారం ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కూ 17.93 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement