Tuesday, April 30, 2024

కరోనా మరణాలను తగ్గించి చూపాల్సిన అవసరం లేదు

రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించి చూపాల్సిన అవసరం ప్రభుత్వానికి  లేదని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో కరోనా నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. కరోనా బాధితులకు బెడ్స్ కేటాయించే విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. ప్రతి హాస్పిటల్ కి నోడల్ ఆఫీసర్ ను నియమించామన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్స్ డాక్టర్స్, ఆర్ఎంవోలు నోడల్ ఆఫీసర్స్ సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఆక్సిజన్ ముందుగా ఎంత అవసరమో అంచనా వేసి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సిద్ధం చేసుకోవాలన్నారు. ఆక్సిజన్ స్టోరేజ్ మరింత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిరోజు 18 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని మంత్రి అన్నారు. కొవిడ్‌ చికిత్స కోసం 6 నెలలకు తాత్కాలిక సిబ్బంది నియామకాలు చేపట్టామన్నారు. కేజీహెచ్‌లో కూడా కొంత ఆక్సిజన్ వృధా అవుతోందని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement