Monday, April 29, 2024

మందు గ్లాస్ తో ప్ర‌గ‌తి.. వైర‌ల్ గా ఫొటోలు

మందుగ్లాస్ పట్టుకుని ఫొటోల‌కి ఫోజులిచ్చింది న‌టి ప్ర‌గ‌తి. కానీ మందు తాగుతున్నట్టు మాత్రం ఫోటోల్లో కనిపించలేదు. దాంతో అందరిని కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది ప్రగతి. ఇందులో ఆమె గ్లాస్ పట్టుకుని కనిపిస్తుంది… అందులో మందు కూడా ఉంది అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంత మంది ప్రగతి ఫాలోవర్స్ మాత్రం అందులో మందు లేదు… ఏం లేదు. అది మందు పార్టీ అని ఎలా చెపుతారు అంటూ రివర్స్ కౌటర్లు వేస్తున్నారు. మొత్తానికి నెటిజన్లను తన ఫోటోస్ తో కన్ఫ్యూజన్ లో పడేసింది ప్రగతి.

ఏది ఏమైనా ప్రగతి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్ లో కాస్త క్లాసిక్ గా కనిపించే మోడ్రన్ మదర్ పాత్రలకు ప్రగతి పెట్టింద పేరు. అయితే ఈమధ్య ప్రగతిలో కొత్త కొత్త కోణాలు బయట పడుతన్నాయి. జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలు.. మాస్ పాటలకు ఊరమాస్ స్టెప్పులేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి.. ఔరా అనిపించింది ప్రగతి. వయసు 50కి దగ్గర పడుతున్నా కుర్ర హీరోయిన్లు కూడా చేయలేనన్ని పనులు చేస్తూ..నెట్టింట హల్ చల్ చేసింది. చేతికి పెద్ద టాటూ.. స్లీవ్ లెస్ డ్రెస్ లతో.. ప్రగతి వేసిన వేశాలు అన్నీ ఇన్నీ కావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement