Friday, May 3, 2024

ప్రభుదేవా మై డియర్‌ భూతం.. జీనీగా కనిపించనున్న డ్యాన్స్​ మాస్టర్​

నటుడిగా, దర్శకుడు, కొరియో గ్రాఫర్‌గా పేరున్న ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మై డియర్‌ భూతం’. తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు అందుకున్న ఎన్‌. రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నా రు. రమేష్‌ పి పిళ్ళై ఈ చిత్రాన్ని నిర్మిం చగా తెలుగు లో శ్రీలక్ష్మి జ్యోతి క్రియేష న్స్‌ అధినేత ఏ.ఎన్‌. బాలాజీ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఫాంటసీ సినిమాగా ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా లో ప్రభుదేవా జీనీగా కనిపిస్తారు.

ఈ పాత్రలోకి ప్రభుదేవా పూర్తిగా పరకాయ ప్రవేశం చేశారు. రమ్య నంబీసన్‌ కీలక పాత్ర లో నటిస్తుండగా బిగ్‌ బాస్‌ ఫేమ్‌ సంయుక్త, ఇమ్మాన్‌ అన్నాచి, సురేష్‌ మీనన్‌ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. డి. ఇమాన్‌ సంగీతం సమకూరుస్తుండగా యూకే సెంథిల్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటు-ంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement