Monday, April 29, 2024

Salaar Movie: సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతూ… ప్రభాస్ అభిమాని మృతి…

హీరో ప్రభాస్ సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఓ అభిమాని మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్మవరం పట్టణంలోని రంగ థియేటర్ లో సలార్ సినిమా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం జరిగింది. బాలరాజు (29) అనే ప్రభాస్ అభిమాని సలార్ విడుదల సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా.. దానికి ఉన్న ఇనుప ఫ్రేమ్ కరెంట్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై చనిపోయాడు.. మరో యువకుడు గజేంద్ర గాయపడ్డాడు.

కరెంటు తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. బాలరాజు హీరో ప్రభాస్ వీరాభిమాని. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులున్నారు. ధర్మవరం ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement