Sunday, April 28, 2024

ప్రభాస్ బర్త్ డే..పోస్టర్ రిలీజ్ చేసిన ప్రాజెక్ట్ కె మేకర్స్

నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ కె నుండి ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొణె నటిస్తుంది..భారీ బడ్జెట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా తెరకెక్కుతోంది ఈ మూవీ. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు.. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నట్లు సమాచారం.నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించడానికి హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. అయితే.. ఇవాళ ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ ట్రీట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఓ పోస్టర్‌ ను రివీల్‌ చేసింది చిత్ర బృందం. త్వరలోనే మరిన్నీ అప్‌డేట్స్ వస్తాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement