Friday, May 10, 2024

హైదరాబాద్ శివార్లలో గసగసాల సాగు

నల్లమందు తయారీదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తు మందు తయారీకి ఇప్పుడు తెలంగాణ
అడ్డాగా మారింది. ఓపీఎంగా పిలిచే దీని తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ఇప్పుడు తెలంగాణలో పండిస్తున్నారు. దీని ముడి సరుకు గసగసాలు కావడం గమనించదగ్గ విషయం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గసగసాల పంటను నిషేధించినప్పటికీ తెలంగాణలో మాత్రం పెద్ద మొత్తంలో పంటలు వేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గసగసాలు పంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి రాచకొండ
పోలీసులు హైదరాబాద్ శివార్లలో పంట వేసిన వారిని పట్టుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పండించిన గసగసాలను మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్, ఒడిషా, మధ్యప్రదేశ్ లకు తరలిస్తున్నట్లు బయటపడింది. మొత్తం 390 బస్తాలను అధికారులు ఇప్పటి వరకు పట్టుకున్నారు. దీన్ని కర్నాటకకు ఎగుమతి చేసి అక్కడి నుంచి దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నట్టుగా
అధికారుల విచారణలో బయటపడింది. ఈ గసగసాలను ముఖ్యంగాహెరాయిన్, కొకైన్, ఓపీఎం లాంటి మత్తు మందు తయారీలకు వాడుతున్నట్లుగా విచారణలో తేలింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయల విలువ ఉంటుందని రాచకొండసీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. అనుమతి లేకుండా ఎవరైనా గసగసాలను పండించిన పక్షంలో వారిపైన
చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

గసగసాల నుంచి మత్తు మందు ఇలా..

ఒక్క గ్రాము గసగసాల కాయలతో మార్ఫిన్ తయారవుతుంది. దానికి మరి కొంత ప్రత్యేక రసాయన పదార్థం జతచేస్తే హెరాయిన్ తయారవుతుంది. ఈ హెరాయిన్ కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఇలా గత కొంతకాలంగా వీళ్లు వ్యా పారం చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలో మెడిసిన్ కోసం గసగసాల కాయలను వినియోగిస్తారు. అది కూడా అక్కడ ప్రభుత్వం కొన్ని నెలల వరకే అనుమతి ఇస్తుంది. ఇక్కడ పండించడానికి ఎలాంటి
అనుమతులు లేవని సీపీ తెలిపారు. దీంతో నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్సైకోట్రోఫిక్ సబ్స్టా న్సెస్ చట్టం (ఎడీపీఎస్ యాక్టు) కింద కేసు నమోదు చేమని సీపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement