Sunday, April 28, 2024

IPL | దంచికొట్టిన పూరన్.. ఉత్కంఠగా సెకండ్ ఇన్నింగ్స్

ఐపీఎల్ 2023.. 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతుండగా.. ఈ కీలక పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కష్ట సమయంలో జట్టును ఆదుకున్నాడు. క్వింటన్ డికాక్ (28), ప్రేరక్ మన్కడ్ (26) ఫర్వాలేదనిపించారు.

సునీల్ నరైన్, వైభవ్ అరోరలు చెరో రెండు వికెట్లు సాధించారు. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఇందులో ఓడితే ఆదివారం జరిగే ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

Jason Roy sweeps one fiercely, Kolkata Knight Riders vs Lucknow Super Giants, IPL 2023, Kolkata, May 20, 2023
Advertisement

తాజా వార్తలు

Advertisement