Sunday, April 28, 2024

బాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్.. కారణం ఏంటంటే..

బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే భర్త సామ్ బాంబే అరెస్ట్‌ అయ్యాడు. పూనమ్ పాండేపై సామ్ బాంబే దాడి చేయడంతో ఆసుపత్రి పాలైంది. అతనిపై పూనమ్ పాండే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సామ్ అహ్మద్ బాంబే అరెస్ట్ అయ్యారు. తనను జుట్టు పట్టుకుని తలను గోడకు కొట్టాడని పూనమ్ పాండే తన ఫిర్యాదులో ఆరోపించింది. ఈ దాడిలో తన కన్ను, ముఖంపై తీవ్ర గాయమైనట్లు పేర్కొంది. కాగా ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పూనమ్ పాండే ఆస్పత్రిలో చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement