Sunday, April 14, 2024

ఇంటర్‌లో పొలిటికల్‌ సైన్స్‌ తొలగించట్లేదు.. స్ప‌ష్టం చేసిన అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ విద్యలో అందిస్తున్న కోర్సుల నుంచి పొలిటికల్‌ సైన్స్‌(పౌరశాస్త్రం)ని తొలగించట్లేదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లోనూ పొలిటికల్‌ సైన్స్‌ ఒక ఐచ్చిక సబ్జెక్టుగా అందిస్తోందని తెలిపింది. సమాజావసరాలను బట్టి కొత్త కోర్సులను, సబ్జెక్టులను ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపింది. ఈక్రమంలో ఏ సబ్జెక్టును తొలగించడంలేదని ఇంటర్‌ బోర్డు సోమవారం దీనిపై స్పష్టత ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement