Monday, May 6, 2024

ఎస్సీ గురుకులాల్లో ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ విధానం.. ఐఐటీ, నీట్‌ పోటీ పరీక్షలకు 11 శిక్షణా కేంద్రాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో ఈ ఏడాది సీబీఎస్‌ఇ విద్యావిధానాన్ని అమలు చేయనున్నట్లు- సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకులానికి చెందిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బీవోజీ) 70 వ సమావేశం మంగళవారం తాడేపల్లిలోని గురుకులం ప్రధాన కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగాన మంత్రి నాగార్జున మాట్లాడుతూ సీబీఎస్‌ఇ విధానంలో భాగంగా గురుకులాలకు చెందిన టీ-జీటీ- టీ-చర్లకు సీబీఎస్‌ఇ కి చెందిన ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌లలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. డిమాండ్‌ లేని కోర్సుల స్థానంలో డిమాండ్‌ కలిగిన కోర్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ విద్యార్థులకు వృత్తి విద్య, క్రీడలలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన్నట్లు- మంత్రి నాగార్జున తెలిపారు.

ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఏఎన్‌ఎం కోర్సులలో శిక్షణలు ఇవ్వడానికి చర్యలు తీసుకోనున్నామన్నారు. అలాగే క్రీడల్లో కూడా విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ఏలూరు జిల్లాకు చెందిన కొలసానిపల్లి, పెదవేగిలలో స్పోర్ట్స్‌ అకాడమీలను ఏర్పాటు- చేయడానికి చర్యలు తీసుకుంటు-న్నామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రాష్టంలో ఉన్న మూడు ఐఐటీ-, నీట్‌ శిక్షణా కేంద్రాలు కాకుండా అదనంగా ఉమ్మడి జిల్లాలో జిల్లాకు ఒకటి చొప్పున 11 శిక్షణా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు- చేయాలని నిర్ణయించడం జరిగిందని నాగార్జున వివరించారు. అలాగే ఖాళీగా ఉన్న 90 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులను భర్తీ చేయడానికి, అవసరమైన చోట కొత్తగా నర్సింగ్‌ పోస్టులను మంజూరు చేయడానికి చర్యలు తీసుకోనున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement