Saturday, May 18, 2024

సిద్దేశ్వరం అలుగు చేపట్టాల్సిందే.. సీమలో అదనంగా ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు

సంగమేశ్వరం వద్ద సిద్దేశ్వరం అలుగు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టాలని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రాయలసీమ సాగు నీటి సాధన సమితి ఆధ్వర్యంలో జలదీక్ష నిర్వ‌హించారు. పోలీసుల ఆంక్షల నడుమ పెద్ద ఎత్తున రైతులు చేరుకుని కృష్ణానదిలో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడారు. రాయలసీమ ప్రజల డిమాండ్ అయిన సిదేశ్వరం అలుగు చేపట్టే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు.

ఇది పూర్తయితే రాయలసీమలో అదనంగా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వాల మాదిరిగానే ఇప్పుడున్న ప్రభుత్వం సిద్ధేశ్వరం అలుగుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ప్రాజెక్టును సవాలుగా తీసుకుని సీమకు సాగునీరు అందించేలా సీఎం జగన్​ కృషిచేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement