Friday, June 9, 2023

నాటు సారా స్థావరాలపై – పోలీసుల దాడులు

ఉరవకొండ (ప్రభ న్యూస్ ) : జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు వజ్రకరూరు ఎస్సై రాఘవేంద్రప్ప ఆధ్వర్యంలో పోలీసులు పి.సి.ప్యాపిలి తాండా గ్రామ శివార్లలోని నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ ఘ‌ట‌న‌లో 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడం తో తాండా గ్రామ శివార్లలో నాటు సారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించామని ఎస్ ఐ తెలిపారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని తండా వాసులను హెచ్చరించారు. ఈ దాడుల్లో వజ్రకరూరు పోలీసు సిబ్బంది పవన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement