Wednesday, April 14, 2021

షర్మిల సభపై అనుమానాలు – కొత్తగా పోలీసుల నోటీసులు

తెలంగాణ రాజకీయాలలో షర్మిల దూకుడు పెంచారు ఇప్పటికే పార్టీ పేరును విధివిధానాలను ఏప్రిల్ 9 న జరగబోయే సభలో ప్రకటించబోతున్నట్లు తెలిపారు. అయితే ఇటువంటి సమయంలో షర్మిల ఖమ్మం సభ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇప్పటికే సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు…తెలంగాణలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జీవో 68, 69 ప్రకారం నోటీసులు ఇచ్చారు. కాగా నిబంధనలు పాటిస్తూ సభ జరుపుతామన్న నిర్వాహకులు చెబుతున్నారు.

వాస్తవానికి ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో సభకు షర్మిల బృందం ఇటీవల పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. ఇంతలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో పోలీసు శాఖ పునరాలోచనలో పడింది.ఈ క్రమంలోనే పోలీసులు షర్మిల బృందానికి నోటీసులు జారీ చేశారు. జీవో 68, 69 ప్రకారం ఖమ్మం జిల్లా ఇన్చార్జి లక్కినేని సుధీర్ కు నోటీసులు పంపారు.కాగా కరోనా మార్గదర్శకాలు, అన్ని నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహిస్తామని షర్మిల బృందం పోలీసులకు బదులిచ్చినట్టు తెలుస్తోంది. మరి షర్మిల తలపెట్టబోతున్న ఈ సభ ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Prabha News