Thursday, May 2, 2024

National: మోదీ ఉమెన్స్‌ డే కానుక… వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర త‌గ్గింపు…

మహిళా దినోత్సవం సందర్భంగా మ‌హిళ‌కు ప్ర‌ధాని మోదీ కానుక‌ను అందించారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ‍ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. వంట గ్యాస్‌ ధరను తగ్గించడంతో ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించడానికి అనుగుణంగా ఉంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement