Monday, April 29, 2024

America: వాల్‌మార్ట్‌పై దాడి చేస్తానని పైలట్​ హెచ్చరిక.. గంట నుంచి గాలిలోనే చక్కర్లు కొడుతున్న విమానం

అమెరికాలోని మిస్సిసిపిలో ఉన్న‌ వాల్‌మార్ట్‌పై విమానంతో దాడి చేస్తానని ఓ పైలెట్‌ హెచ్చరించాడు. దాదాపు గంట సేపటి నుంచి స్టోర్‌ పరిసరాల్లో ఆ విమానం చక్కర్లు కొడుతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాల్‌మార్ట్‌ స్టోర్‌ సిబ్బందితో పాటు, కొనుగోలుదారులను స్టోర్‌ నుంచి బయటకు పంపించారు. వాల్‌మార్ట్‌ పరిసరాల్లోకి ఎవరూ రావ‌ద్ద‌ని పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

అయితే.. వాల్‌మార్ట్‌ను ఉద్దేశపూర్వకంగానే ఢీకొడుతానని పైలెట్‌ హెచ్చరిస్తుండగా.. దీనికి గల కారణాలు మాత్రం తెలియ‌డం లేదు. ప్రస్తుతం పోలీసులు ఆ పైలెట్‌తో మాట్లాడేందుకు యత్నిస్తున్నారు. కాగా, పైలట్ విమానాశ్రయం నుంచి చిన్న విమానమైన బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్-90ని దొంగ‌త‌నంగా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విమానానికి రెండు ఇంజిన్లు ఉండడంతో పాటు తొమ్మిది సీట్ల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం స్టేట్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజర్స్ ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని గవర్నర్‌ టేట్‌ రీవ్స్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement