Monday, May 6, 2024

MODI SONG: ఫిర్ ఆయేగా మోడీ…ఎన్నికల ప్రచార గీతాన్ని విడుద‌ల చేసిన బిజెపి..

న్యూ ఢిల్లీ – వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందంటూ భాజపా ధీమా వ్యక్తం చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం తాజాగా ప్రత్యేక ప్రచార గీతాన్ని విడుదల చేసింది.

‘ఫిర్‌ ఆయేగా మోడీ (మోడీ తిరిగొస్తాడు)’ పేరుతో రూపొందించిన ఈ పాటలో ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన పథకాలు, మోడీ నేతృత్వంలో అంతర్జాతీయంగా భారత్‌ సాధించిన ఘనతలను ప్రస్తావించారు. ఆర్టికల్‌ 370, అయోధ్య రామ మందిరం, వందే భారత్‌ రైళ్లు, నూతన పార్లమెంట్‌ భవనానికి సంబంధించిన విశేషాలను ఈ వీడియోలో చూపించారు. ‘‘మనం సాధించిన ఘనతలతో ఢంకా మోగిద్దాం. శ్రీరాముడి దీవెనలతో మోడీ మళ్లీ వస్తారు. ఆయన ఓ వ్యక్తి కాదు.. దేశం గర్విస్తున్న శక్తి’’ అని భాజపా రాసుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement