Tuesday, April 30, 2024

వాహనదారులు త్వరపడండి!

వాహనదారులకు మరోసారి స్వల్ప ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి చమరు సంస్థలు. నాలుగు రోజుల తరువాత మరోమారు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. ఈ రోజు ఉదయం లీటరు పెట్రోలుపై 22 పైసలు, డీజిల్ పై 23 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ ధర రూ.94.16కు, డీజిల్ ధర రూ.88.20కు చేరింది.

మారిన ధరల తరువాత దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 90.56కు తగ్గగా, డీజిల్ ధర లీటరుకు రూ. 80.87కు చేరింది. ఇక ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.98గా ఉండగా, డీజిల్‌ ధర రూ. 87.96కు చేరుకుంది. కోల్‌ కతాలో పెట్రోల్‌ రూ.  90.77గా, డీజిల్ ధర  రూ 83.75గా ఉంది. ఇక చెన్నై విషయానికి వస్తే, పెట్రోల్ ధర రూ. 92.58కు, డీజిల్ ధర రూ. 85.88 22కు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.42 శాతం తగ్గుదలతో 64.78 డాలర్లకు క్షీణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement