Monday, April 29, 2024

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.110, డీజిల్‌ రూ.98.49

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన నేపథ్యంలో పెట్రో, డీజెల్‌ ధరలు భారీగా తగ్గనున్నాయి. హైదరాబాద్‌లో ఇకపై లీటర్‌.. పెట్రోల్‌ రూ.110లకు, డీజెల్‌ రూ.98.49లకే లభించనుంది. లీటర్‌ పెట్రోల్‌పై కేంద్రం నేరుగా రూ.8 మేర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇతరత్రా తగ్గింపులు కలుపుకుని రూ.9.50 మేర ధర తగ్గనుంది. ఎక్సైజ్‌ సుంకం తగ్గించకముందు హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.119.49గా ఉంది. తాజా తగ్గింపుల నేపథ్యంలో రూ.110కే లభించనుంది.

ఇక… హైదరాబాద్‌లో లీటర్‌ డీజెల్‌ రూ.100లోపే లభించనుంది. ఇప్పటి వరకు నగరంలో లీటర్‌ డీజెల్‌ ధర రూ.105.49పైసలుగా ఉంది. డీజెల్‌పై కేంద్రం నేరుగా రూ.6 తగ్గించడంతో రాష్ట్రంలో ఇతరత్రా తగ్గింపులను కలుపుకుని రూ.7 మేర తగ్గనుంది. దీంతో ఇప్పటి వరకు రూ.105.49గా ఉన్న డీజెల్‌ ఇకపై రూ.98.49 పైసలకే లభించనుంది. పెట్రో, డీజెల్‌ ధరలు తగ్గడంతో… నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement