Wednesday, May 29, 2024

TS | మాట తప్పిన రేవంత్ కు ప్రజలే బుద్ది చెబుతారు : హరీశ్ రావు..

కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఅర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ‘‘గత ఎన్నికల్లో బీజేపీ భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్లే బండి సంజయ్ గెలిచాడు. ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదు. వినోదన్న ఓడిపోయినా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేశారు’’ అని అన్నారు.

వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని హరీశ్ రావు అన్నారు. మంచినీరు సరిగా రావడం లేదు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, బాండ్ పేపర్లు రాసి మరీ మోసం చేశారని విమర్శించారు. మాట తప్పిన రేవంత్ రెడ్డీకి ఎంపీ ఎన్నికల్లో ప్రజలు చురుకు పెడతారని హ‌రీశ్ రావు అన్నారు. సొల్లు మాటలు తప్ప కాంగ్రెస్ లీడర్లు ఒక్క మంచి మాటన్నా చెబుతున్నారా… కేసీఆర్ చెడ్డి ఊడగొడుతా అంటున్నాడు రేవంత్. నువు చెడ్డి గ్యాంగ్ వెంట తిరిగినవా రేవంత్? ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా?’’ అని హరీశ్ రావు మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement