Thursday, April 25, 2024

రేపు మహేష్‌బాబు చేతుల మీదుగా ‘పెళ్లిసందD’ మూవీ ట్రైలర్

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ సినిమా రూపొందింది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ సినిమాతో, గౌరీ రోణంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో శ్రీకాంత్ హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న రాఘవేంద్రరావు, ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అంతేకాదు ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించారు.

గతంలో ఆయనతో ‘పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి, చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళుతున్నాయి. ఇక ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. ఈ సినిమాతో శ్రీలీల తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. శ్రీకాంత్ మాదిరిగానే ఆయన తనయుడికి ఈ టైటిల్ కలిసొస్తుందేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement