Sunday, May 5, 2024

ఘనంగా తెలంగాణ‌ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మ‌న్ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ జెండా ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఐ డి సి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement