Sunday, May 26, 2024

PBKS vs RR | టాస్ గెలిచిన రాజ‌స్థాన్..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ – టేబుల్ టాప‌ర్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డనున్నాయి. టాస్ గెలిచిన రాజ‌స్థాన్ సార‌థి సంజూ శాంస‌న్ బౌలింగ్ ఎంచుకుని పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ ఆడ‌ట్లేదు. అత‌డి స్థానంలో అధ‌ర్వ తైడే జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక రాజ‌స్థాన్ సైతం రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నుంది. రొవ్‌మ‌న్ పావెల్, రంజీ హీరో కొటియాన్ తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నారు.

పంజాబ్ తుది జట్టు : జానీ బెయిర్‌స్టో, ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్, అధ‌ర్వ తైడే, సామ్ క‌ర‌న్‌(కెప్టెన్), లివింగ్‌స్టోన్, జితేశ్ శ‌ర్మ‌, శ‌శాంక్ సింగ్, హ‌ర్‌ప్రీత్ బ్రార్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, అర్ష్‌దీప్ సింగ్, ర‌బ‌డ‌.

రాజ‌స్థాన్ తుది జ‌ట్టు : సంజూ శాంస‌న్(కెప్టెన్), రియాన్ ప‌రాగ్, హెట్‌మైర్, ధ్రువ్ జురెల్, ట్రెంట్ బౌల్ట్, య‌జ్వేంద్ర చాహ‌ల్, అవేశ్ ఖాన్. కుల్దీప్ సేన్, కేశ‌వ్ మ‌హారాజ్, త‌నుష్ కొటియాన్, రొవ్‌మాన్ పావెల్,

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement