Tuesday, May 28, 2024

హైదరాబాద్‌లో మరో బిజినెస్ ప్రారంభించిన హీరోయిన్ రకుల్

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా మ‌రో వ్యాపారంలో అడుగుపెట్ట‌నుంది. హైద‌రాబాద్‌లో ఆమె ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించ‌నుంది. ‘ఆరంభం’ పేరుతో ఓ రెస్టారెంట్ ను మాదాపూర్‌లో ఈ నెల 16న ఓపెన్ కానుంది. ఇందులో తృణ‌ధాన్యాల‌తో చేసిన వంట‌కాలు ల‌భించ‌నున్నాయి. కాగా.. రెస్టారెంట్ ప్రారంభించ‌డంపై ర‌కుల్ ఆనందం వ్య‌క్తం చేసింది. అంద‌రికీ న్యూట్రిష‌న్ అందించాల‌న్న‌దే త‌మ రెస్టారెంట్ ల‌క్ష్య‌మ‌ని చెప్పుకొచ్చింది. ఆరంభంలో ఫుడ్ శ‌రీరానికి మాత్ర‌మే కాద‌ని, మ‌న‌సుకు కూడా అని చెప్పింది.

కాగా.. ర‌కుల్ ఇటీవ‌లే బాలీవుడ్ నిర్మాత జాకీ భ‌గ్నాని వివాహం చేసుకుంది. పెళ్లి త‌రువాత వ్యాపారాల‌పై ర‌కుల్ ఎక్కువ ఆస‌క్తి చూపుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హైద‌రాబాద్‌, వైజాగ్‌ల‌లో F-45 పేరుతో జిమ్‌ల‌ను ఏర్పాటు చేసింది. చాలా మంది స్టార్ హీరోలు ఈ జిమ్‌ల‌కు వెలుతుంటారు. వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ ర‌కుల్ పెట్టుబడులు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement