Monday, May 20, 2024

PBKS vs RCB | కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్…

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో రసవత్తర పోరు జరగనుంది. దాదాపు నిర్జీవంగా ఉన్న ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టుకునెందుకు కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్, బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుని.. ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.

జట్ల వివరాలు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (c), రజత్ పాటిదార్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (WK), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్.

పంజాబ్ కింగ్స్ :

జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్ (c), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), రిలీ రోసౌ, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, విధ్వత్ కావరప్ప.

- Advertisement -

ప్రస్తుతం రెండు టీమ్‌లు లు ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి. ఆర్‌సీబీ ఏడో ప్లేస్‌లో, పంజాబ్ ఎనిమిదో ప్లేస్‌లో పాయింట్ల పట్టికలో కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement