Wednesday, May 8, 2024

రేపు ‘OG’ షూటింగ్ లో జాయిన్ కానున్న పవన్ కళ్యాణ్..

హరీష్ సంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే పూర్తి చేశారు. కాగా, ఇప్పుడు సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కన్న మరో యాక్షన్ ఎంటర్టైనర్ ‘OG’ కోసం ఇవ్వాల (సోమవారం) ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లారు. రేపు (మంగళవారం), “OG” రెగ్యులర్ షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తన అత్యంత స్టైలిష్ అవతార్‌లో కనిపించనున్నాడు.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. అండర్ వరల్డ్ మాఫియాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను రేపు ముంబైలో చిత్రీకరించనున్నారు. వారం రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ హైదరాబాద్ కు రానున్నారు. ఈ మూవీని డీవీవీ దానయ్య బ్యాంక్రోల్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement