Thursday, May 2, 2024

ఆందోళనల్లో పాల్గొంటే.. అవకాశాలు పోయినట్లే : ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ స్పష్టీకరణ

అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ రోడ్లెక్కి ఆందోళనల్లో పాల్గొంటున్న ఉద్యోగార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అలాంటివారికి పోలీస్‌ క్లియరెన్స్‌ రాదని, ఫలితంగా త్రివిధ దళాల్లో చేరే అవకాశం చేజారిపోతుందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌చౌధురి హెచ్చరించారు. సైన్యంలో చేరగోరేవారినుంచి ఇలాంటి హింస, విధ్వంసం ఊహించలేదని, అలాంటివారిని సమర్థించలేమని, వారికి సైన్యంలో చేరే అవకాశాలు తక్కువేనని స్పష్టం చేశారు.

సైన్యంలో చేరాలంటే అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ పోలీసుల క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కీలకమని గుర్తు చేశారు. అల్లర్లలో పాలుపంచుకుంటే ఆ సర్టిఫికెట్‌ ఇవ్వరని, అది లేకుండా సైన్యంలో చేరడం సాధ్యం కాదని అన్నారు

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement