Friday, April 26, 2024

చిలుక ఎగురుతూ వీడియో షూట్ చేయడం చూశారా..?

మీరు ఎప్పుడైనా పక్షిలా ఎగరాలని అనుకున్నారా..హా అనుకంటే ఏం లాభం..మనకు రెక్కలు లేవని వెనక్కివచ్చారా..అయితే పక్షిలా ఎగరలేకపోయిన పక్షి ఎలా ప్రయాణిస్తుందో మాత్రం చూసే ఓ అవకాశం వచ్చింది. ఓ చిలుక తాను ఎగురుతూ ఎక్కడెక్కడ తిరిగిందో మొత్తం వీడియోలో బంధించింది. అవును నిజమే చిలుక తన ప్రయణాన్ని ఓ నిముషం పాటు వీడియో తీసింది.  చిలుక మాట్లాడుతుంద‌ని తెలుసుగాని, ఇలా వీడియోను షూట్‌చేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.  ఓ వ్య‌క్తి త‌న మొబైల్‌ను చూసుకుంటుండ‌గా చిలుక అమాంతంగా ఆ మొబైల్ ఫోన్‌ను ఎత్తుకు పోయింది.  అయితే ముక్కుకు ఫోన్‌ను క‌రుచుకుపోవ‌డంతో వీడియో మోడ్ ఆన్ అయింది.  అంతే చిలుక ఆకాశంలో ఎగురుతున్నంత సేపు ఆ మొబైల్‌లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.  ఇళ్ల‌మీద నుంచి ఎగురుతున్న చిలుక ఛాయా చిత్రం కూడా నేల‌పై రికార్డ్ అయింది.  అలా ఓ నిమిషంపాటు గాల్లో మొబైల్ ఫోన్‌తో విహ‌రించిన ఆ చిలుక ఓ ఇంటి రూఫ్ మీద కూర్చున్న‌ది.  ఆ త‌రువాత అక్క‌డి నుంచి ఓ కారుపై వాలిన‌ట్టు వీడియోలో రికార్డ్ అయింది.  దీనికి సంబందించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న‌ది.  

https://twitter.com/fred035schultz/status/1430231941283041288
Advertisement

తాజా వార్తలు

Advertisement