Monday, April 29, 2024

పార్లమెంట్‌ లో పెగాసస్‌ రభస..మళ్లీ వాయిదా పడ్డ ఉభయ సభలు..

పెగాసస్‌ వ్యవహారం పార్లమెంట్‌ ఉభయసభలను కుదిపేస్తూనే ఉంది. పెగాస‌స్ ప్రాజెక్టు నివేదిక‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశాయి విపక్షాలు. పార్లమెంట్‌లో విప‌క్షాలు నినాదాల‌తో హోరెత్తించాయి.. రాజ్యస‌భ‌లో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టారు. పెగాస‌స్ ప్రాజెక్టు నివేదిక‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని పట్టుబట్టారు.. మరోవైపు.. లోక్‌సభలోనూ అదే పరిస్థితి.. దీంతో.. ఉభయసభలను వాయిదా వేశారు. మొదట ఉభయసభలు 12 గంటల వరకు వాయిదా పడగా.. తిరగి ప్రారంభమైన తర్వాత కూడా అదే సీన్‌ రిపీట్‌ కావడంతో మళ్లీ వాయిదా పడ్డాయి. పార్ల‌మెంట్ చ‌ట్టాలు చేసేందుకు ఉంద‌ని, కానీ స‌భ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటున్న‌ట్లు వెంక‌య్య అన్నారు. పార్ల‌మెంట్ దిగ‌జారిన తీరు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.

ఇది కూడా చదవండి : భార్య అక్రమ సంబంధం.. ప్రియుడి పురుషాంగంపై తుపాకీతో భర్త కాల్పులు

Advertisement

తాజా వార్తలు

Advertisement