Thursday, May 2, 2024

మీరు ప్రధాని కాకముందు పాకిస్తాన్‌ గొప్పగా ఉండేది.. ఇమ్రాన్‌పై మాజీ భార్య యార్కర్‌

సొంత పార్టీ, విపక్షాలు, సైన్యం నుంచి సహాయ నిరాకరణ ఎదురై అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటూ పతనం ఉంచున్న ఉన్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై మాజీ భార్య యార్కర్‌ సంధించారు. పాకిస్తాన్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించగల మేధస్సు, సామర్థ్యం లేని ఇమ్రాన్‌ ఎప్పుడూ పొగడ్తలనే కోరుకుంటారని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే తెలివితేటలు లేవని అతడి మాజీ భార్య, జర్నలిస్ట్‌ రేహమ్‌ ఖాన్‌ వ్యాఖ్యాునించారు. అవిశ్వాస తీర్మానంపై గురువారం జాతీయ అసెంబ్లిలో మాట్లాడుతూ పాకిస్తాన్‌ అభివృద్ధికి తాను ఎంతోకృషి చేస్తున్నానన్న ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై ఆమె సెటైర్లు వేశారు.

ఔను.. మీరు ప్రధాని కాకముందు పాకిస్తాన్‌ గొప్పగా ఉండేదంటూ చురకలు వేశారు. నయా పాకిస్తాన్‌ కోసం తాను పనిచేస్తానని 2018లో అధికారంలోకి వచ్చినపుడు చేసిన హామీ నిలబెట్టుకోలేకపోయారని, దారుణంగా విఫలమైన ఆయనను గద్దె దించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇక ఆయన ఓ చరిత్ర.. మనం అందరం కలసి ఈ చెత్తను తొలగించాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రెహమ్‌ ఖాన్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement