Tuesday, May 14, 2024

పడిపోయిన ఆక్సిజన్ రీఫిల్లింగ్ ధరలు!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నెల క్రితం కరోనా పెరుగుదల రేటు విపరీతంగా ఉండటంతో.. ఆక్సిజన్ సిలిండర్ కొరతా ఏర్పడింది..కాని ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పటడ్డంతో..మొన్నటి వరకు వేలల్లో ధర పలికిన మెడికల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు అమాంతం తగ్గాయి. అంతేకాదు ఇప్పుడు పలు సంస్థలు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుండడంతోపాటు అక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా రీఫిల్లింగ్ ధరలతోపాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

పెద్ద సిలిండర్ రీఫిల్లింగ్ ధర రూ. 2000-3000 వరకు పలకగా తాజాగా దాని ధర రూ. 600కు పడిపోయింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు రూ. 60-70 వేల నుంచి రూ. 15-25 వేల మధ్య పలుకుతున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడం, చాలినంత ఆక్సిజన్ అందుబాటులోకి రావడమే ధరల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. ఆక్సిజన్‌కు అంతగా గిరాకీ లేని ఏప్రిల్ మొదటి వారంలో 150 క్యూబిక్ మీటర్ మెడికల్ ఆక్సిజన్ ఉండే పెద్ద సిలిండర్‌ను నింపేందుకు రూ. 350 తీసుకునేవారు. ఆ తర్వాత గిరాకీ పెరగడంతో ఆ ధర రూ. 600కు పెరిగింది. అదే నెల 20 నాటికి రూ.1000కి పెరగ్గా ఈ నెల మొదటి వారానికి మరింత పెరిగి రూ. 2500 నుంచి రూ. 3 వేలకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement