Saturday, May 18, 2024

గుడ్ న్యూస్: రేపు కేరళను తాకనున్న నైరుతి..

అన్నదాతలకు శుభవార్త..ఈసారి రుతుపవనాలు అనుకున్న సమయానికే రానున్నాయి. రేపటికల్లా నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. ఇక ఈరోజు రేపూ ఎల్లుండీ కూడా తెలంగాణలో చెదురుమదురుగా ఈదురుగాలులతో వర్షాలు. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత కూడా ఈ తరహా వాతావరణమే కొనసాగుతుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణుల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో, కేరళ, కర్నాటక తమిళనాడు, మధ్యప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటి వరకూ అగ్ని గుండంలా ఉన్న పశ్చిమ రాజస్తాన్లో కూడా గాలివానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. వీటన్నిటి వల్లా సూర్యతాపం గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున రుతుపవనాలు వేగంగా విస్తరిస్తాయని విశాఖ వాతావరణ శాఖ చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement