Wednesday, May 1, 2024

ఇంట‌ర్ ఫ‌లితాల‌పై కొన‌సాగుతున్న ఆందోళన.. భారీ సంఖ్య‌లో రీవెరిఫికేష‌న్ ద‌ర‌ఖాస్తులు..

ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాల రగడ ఇంకా రాష్ట్రంలో కొనసాగుతునే ఉంది. ఫలితాల విషయంలో అటు విద్యార్థి సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు సైతం తమ అభ్యంతరాలను, ఆందోళనలను తెలుపుతున్నాయి. అయితే ఫలితాల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు సంబంధించి గడువు ముగిసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు రీవెరిఫికేషన్‌కు 31,952 దర ఖాస్తులు, రీకౌంటింగ్‌కు 3,497 మంది ఇంటర్‌ బోర్డుకు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది.

ఈనెల 16న ప్రకటించిన ఫలితాల్లో 2.35లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌ అయిన నేపథ్యంలో ఫలితాల రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు విద్యార్థు లకు అవకాశం కల్పిస్తూ ఫీజును 50 శాతం తగ్గిస్తూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement