Monday, April 15, 2024

శంషాబాద్‌లో మహిళ దారుణహత్య

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఊటుపల్లి ఇంద్రనగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న యాదమ్మ (35) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోనే గొంతుకోసి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement