Sunday, May 5, 2024

వెండితెర‌పై ‘సుమ‌’..చేసేస్తే పోలే అంటోన్న యాంక‌ర్..అస‌లు సంగ‌తేంటీ..

తెలుగువారికి అందులోనూ నిత్యం టీవీ చూసేవారికి ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేని పేరు సుమ క‌న‌కాల‌. గ‌త కొన్ని ఏళ్ళుగా బుల్లితెర‌పై తిరుగులేని మ‌హారాణిగా రాణిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల్లో న‌టించింది సుమ‌..ఆడ‌పాద‌డ‌పా ప‌లు క్యారెక్ట‌ర్ల‌లో న‌టిస్తోంది కూడా. అయితే ఆమె మ‌రోసారి వెండితెర‌పై సంద‌డి చేయ‌నుంద‌నే వార్త వినిపిస్తోంది. ఏ ఈవెంట్ చూసినా..ఏ ఫోగ్రాం చూసినా వినిపించే పేరు సుమ‌. ఓ ప‌క్క ఈవెంట్స్..మ‌రోప‌క్క ప‌లు షోల‌తో ఆమె బిజీ బిజీగా గ‌డుపుతోంది. అంత బిజీగా ఉందంటే డ‌బ్బులు కూడా సంపాదిస్తుంద‌నేగా అర్థం..ఆ విష‌యాన్ని సుమ‌నే స్వ‌యంగా చెప్ప‌డం విశేషం.

వెండితెర‌పై ఇప్ప‌టికే అనసూయ, రష్మీ, శ్రీముఖి, ఝాన్సీ లాంటి యాంకర్స్ ఉండగా ఇప్పుడు సుమ కూడా వ‌చ్చింది. ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన ఈ యాంకర్ ఇక వెండితెరపై మెరుపులు మెరిపించనుందట. గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ వైరల్ అవుతుండగా తాజాగా దీనిపై రియాక్ట్ అవుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది సుమ. ఓ వీడియో ద్వారా సుమ ఈ విషయాన్ని కాస్త వెరైటీగా చెప్పింది. స్టార్ హీరోల వీడియో క్లిప్స్ కట్ చేస్తూ ఓ వీడియో రెడీ చేసి.. ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అంటూ ఓపెన్ అయింది సుమ. రెమ్యూనరేషన్ కూడా కోట్లలో ఉండనుంది అనే హింట్ ఇచ్చేసింది. అతి త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వబోతున్నామంటూ అస‌లు విష‌యాన్ని దాట‌వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement