Friday, April 26, 2024

పొన్నియిన్ సెల్వ‌న్2.. రిలీజ్ డేట్ ఫిక్స్

ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వ‌న్ పార్ట్1 విడుద‌లై విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. కేవలం తమిళంలోనే కాకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.460 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించింది. అయితే తాజాగా రెండో పార్టుకు సంబంధించిన రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌ అయింది. పొన్నియన్‌ సెల్వన్‌ పార్టు-2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు దీనిపై అధికారికంగా ప్రకటన చేసింది. చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయంరవి, త్రిష, ఐశ్వర్యరాయ్‌ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మణిరత్నం కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా తెరకెక్కించాడు.మ‌రి ఈ చిత్రం ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement