Tuesday, May 7, 2024

కొడాలి నానిపై కాలు వేసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్-వైర‌ల్ గా పాత ఫొటో

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , కొడాలినానిపై కాలు వేసి ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కొడాలి నానితో పాటు.. టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్ర‌స్తుతం వైసీపీకి స‌న్నిహితంగా మెల‌గుతున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ కూడా ఈ ఫొటోలో ఉన్నారు. కొడాలి నాని మ‌ధ్య‌లో కూర్చుని ఉండ‌గా… ఆయ‌న‌కు ఎడ‌మ వైపున కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌… త‌న కాలిని కొడాలి నాని కాలిపై వేసి మ‌రీ కూర్చున్నారు. అదేమీ ప‌ట్టించుకోకుండా కొడాలి నాని ఏదో పుస్త‌కంలోనో, నోట్స్‌లోనో లీన‌మైన‌ట్లుగా క‌నిపిస్తున్నారు. ఇక ఈ స‌న్నివేశాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వంశీ చిరున‌వ్వులు చిందిస్తున్నారు.నాని, వంశీ ఇద్ద‌రూ టీడీపీతోనే రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన వారే. వీరిద్ద‌రూ టీడీపీలో ఉండ‌గా… వీరితో జూనియ‌ర్ ఎన్టీఆర్ చాలా స‌న్నిహితంగా మెల‌గేవారు. ఈ క్ర‌మంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో రెండు, మూడు సినిమాల‌కు వంశీ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హరించారు. కొడాలి నాని కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను నిర్మించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ అంటే వీరిద్ద‌రికీ ఎన‌లేని అభిమానం. ఈ కార‌ణంగానే ఏ పార్టీలో ఉన్నా… హ‌రికృష్ణ వ‌చ్చారంటే నాని గానీ, వంశీ గానీ ఆయ‌న వెన్నంటే న‌డిచేవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement