Tuesday, May 7, 2024

హైదరాబాద్‌లో ఓలా ప్రైమ్‌ ప్లస్‌ సేవలు

హైదరాబాద్‌ : క్యాబ్‌ బుకింగ్‌ సేవలు అందిస్తున్న ఓలా తన ప్రైమ్‌ ప్లస్‌ సర్వీస్‌లను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ముందు బెంగళూర్‌లో ఈ సేవలను ప్రారంభించిన సంస్థ , తాజాగా హైదరాబాద్‌తో పాటు, ముంబై, పుణ నగరాలకు విస్తరించింది. ఎంపిక చేసిన కస్టమర్లుకు ముందుగా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, తరువాత అందరికీ వీటిని అందిస్తామని కంపెనీ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ తెలిపారు. ఓలా ప్రీమియం సర్వీస్‌ను ఓలా ప్రైమ్‌ ప్లస్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రొఫెషనల్‌ డ్రైవర్లు ఉంటారని కంపెనీ తెలిపింది. ప్రీమియం కార్లతో సేవలు అందించే ఈ సర్వీస్‌లో క్యాన్సిలేషన్లు, ఆపరేషన్‌ ఇబ్బందులు ఉండవని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement