కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ మండలం వడ్లంలో ఉపాధి హామీ అధికారుల నిర్వాకం వెలుగు చూసింది. ఓ కానిస్టేబుల్, వీఆర్వోలను అధికారులు ఉపాధి హామీ కూలీలుగా రికార్డులో పేర్కొన్నారు. దీంతో ఈ ఇద్దరి పేర్లపై డబ్బులు దండుకున్నారు. అంతేకాకుండా చనిపోయిన మరో ఇద్దరిపైనా రికార్డులు సృష్టించి పనికి వచ్చినట్లు రికార్డుల్లో చూపించి రూ.22 లక్షలను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కరోనా సమయంలో ఎంతో మందికి ఉపయోగపడిన ఉపాధి హామీ పథకం కొందరు అవినీతి అధికారులకు అడ్డాగా మారింది. ఉపాధి హామీ పథకంలో ఇంకా చాలామంది పేర్లను చేర్చి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ అవినీతిలో పాల్గొన్న అధికారుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్త కూడా చదవండి: త్వరలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. దళిత వర్గానికి డిప్యూటీ సీఎం పదవి