Tuesday, May 7, 2024

రేషన్‌ బియ్యం కోసం ఏటీఎం.. అమ‌లు చేయ‌నున్న ఒడిశా స‌ర్కారు

ఆహార భద్రత కింద రేషన్‌ పొందుతున్న వారి కోసం ఒడిషా ప్రభుత్వం త్వరలోనే ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఈ సదుపాయాన్ని ముందుగా పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని శాసన సభలో ఒడిషా ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. మొదటి దశలో ముందుగా భువనేశ్వర్‌ పట్టణంలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ తరహా ఏటీఎంలను వినియోగించుకోవడానికి వీలుగా కోడ్‌ ఉన్న ప్రత్యేక కార్డులను లబ్దిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్డులు బయోమెట్రిక్‌ కలిగి ఉంటాయి.

కార్డుదారులు తమ ఆధార్‌ కార్డు నెంబర్‌ను కాని, రేషన్‌ కార్డు నెంబర్‌ను కాని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌ పూర్తి చేయగానే కార్డుదారుడికి ఎంత రేషన్‌ వస్తుందో అది ఈ ఏటీఎం ద్వారా వస్తుందని ఆయన వివరించారు. జాతీయ ఆహార భద్రత, రాష్ట్ర ఆహార భద్రత కింద ఉన్న లబ్దిదారులకు ఇలా ఏటీఎం ద్వారా రేషన్‌ పంపిణీ చేస్తామని వివరించారు. దేశంలోనే మొదటి గ్రేన్‌ ఏటీఎంను హర్యానలోని గుర్గావ్‌లో ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా ఈ తరహా ఏటీఎంలను ప్రారంభించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement